టాలీవుడ్: ‘ఆచార్య’ సినిమా కథ తనదేనని ఒక రచయిత గత కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తున్నాడు. తాను రాసుకున్న కథని మైత్రి మూవీ మేకర్స్ కి వినిపించామని, ఆ కథనే కొరటాల శివ ఆచార్య గా తీస్తున్నాడని ఆరోపణలు చేస్తున్నాడు. ఈ ఇష్యూ పెద్దది అవుతుండడం తో కొరటాల రెస్పాండ్ అయ్యాడు.
రాజేష్ చెప్పిన కథ తాను ఆచార్య సినిమా కోసం రాసుకున్న కథ ఒకటి కాదని శివ చెప్పాడు. ఈ కథను ఎప్పుడో రిజిస్టర్ చేయించాను అప్పటి నుండి మార్పులు ఏమి చెయ్యలేదు అని కూడా చెప్పాడు. అయితే ఇలా పదే పదే కథ గురించి వివాదాలు తీసుకు వస్తే కోర్టుకు కూడా నేను వెళ్తాను అని కొరటాల తెగేసి చెప్పాడు. దీనిపై నిర్మాణ సంస్థలు మాట్నీ ఎంటర్టైన్మెంట్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా రెస్పాండ్ అయ్యాయి. ఇది కొరటాల శివ రూపొందించిన ఒరిజినల్ కథ అని ఎక్కడి నుండి కాపీ చెయ్యలేదని మాట్నీ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా, ‘ఆ రచయిత తమకి కథ చెప్పాడు కానీ ఆ కథ అంత బాగాలేక మేము అతనితో సినిమా తియ్యలేదు అని చెప్పారు. మేము చివరి సంవత్సరం ముగ్గురు కొత్త దర్శకులతో చేసాం, కథ బాగుంది కాబట్టే కొత్త దర్శకులతో చేసాం. కథ బాగుంటే తనతో కూడా చేసే వాళ్ళం అని చెప్పారు. కొరటాల మంచి పేరున్న డైరెక్టర్ అని , ఆయన చాలా సంవత్సరాలుగా కథలు రాసుకుంటూ సొంతంగా పేరు తెచ్చుకున్న మనిషని ఆయన కొత్తగా కాపీ కొట్టాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు మైత్రి మూవీ మేకర్స్.
ఏది ఏమైనా ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి దాని లోంచి ఒక కథని ఊహించుకొని తాను రాసుకున్న కథతో కంపేర్ చేసుకొని, సినిమా కథ తన కథ ఒకటే అని ఇలా రక రకాల ఆరోపణలు చెయ్యడం కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళని మీడియా కూడా ఎంకరేజ్ చెయ్యడం మున్ముందు చాలా సమస్యలకి దారి తీస్తుంది. ఈ మధ్య ఇలాంటి వాల్లు ఎక్కువైపోయారు. కంటెంట్ తక్కువ ఉండి ఇలాంటి వార్తల ద్వారా పబ్లిసిటీ తెచ్చుకొని ఎదిగేద్దాం అనుకుంటున్నారేమో కానీ అది ఎంత వరకు సబబో వాళ్లే ఆలోచించుకోవాలి.