టాలీవుడ్: అక్కినేని ఫామిలీ లో నాగార్జున తర్వాత మూడవ తరంలో కొద్దిగా నిలదొక్కుకున్న హీరో ‘నాగ చైతన్య‘. గత రెండు మూడు సినిమాలు మంచి హిట్ టాక్ తెచ్చుకొని, ప్రస్తుతం మంచి సినిమాలు లైన్ లో పెట్టుకుంటూ పోతూ కెరీర్ ని అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ హీరో. ఇష్క్, మనం, 24 , నాని గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు తీసిన విక్రమ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ మూవీలో నటిస్తున్న నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ తో ఓ మూవీ చేయనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. నేడు ‘కింగ్’ నాగార్జున 61వ పుట్టినరోజును పురష్కరించుకొని వీరి కాంబోలో “థాంక్యూ” అనే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.నాగ చైతన్య కెరీర్ లో 20 వ చిత్రంగా రూపొందించబోతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పైన ‘దిల్ రాజు’ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్తూ మేకర్స్ ‘థాంక్యూ’ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘మా 20 ఏళ్ళ సినీ ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషించినందుకు థాంక్యూ’ అని దిల్ రాజు.నాకు ‘మనం’ సినిమా ఇచ్చిందనుకు థాంక్యూ’ అని విక్రమ్ కె.కుమార్.. ‘నా కింగ్ అయినందుకు థాంక్యూ’ అని నాగ చైతన్య అక్కినేని నాగార్జునకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా నుండి ఒక పోస్టర్ విడుదల చేసారు. అలాగే ఈ సినిమా కూడా షూటింగ్ మొదలుపెట్టి మిగిలిన కొద్దీ భాగం త్వరలో పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్.