ముంబై : భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సమ్యుక్త రూపే కార్డు వచ్చేసింది. భారతీయ రైల్వే ప్రయాణికులకు గరిష్ట లాభాల తోపాటు, రిటైల్, భోజన, వినోదాలపై ప్రయోజనాలు, ఇతర లావాదేవీల మినహాయింపుల అందించేలా ఐఆర్‌సీటీసీ ఎస్‌బిఐ కార్డును రుపే ప్లాట్‌ఫాంపై విడుదల చేశాయి. ఈ క్రెడిట్ కార్డు ద్వారా రైల్వే కు సంబంధించిన లావాదేవీలన్నీ డిజిటల్ గా సురక్షితంగా జరుగుతాయని రైల్వే మంత్రి పియూష్ గోయల్ గతంలోనే ప్రకటించారు.
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా రైల్వేస్టేషన్లోని పీఓఎస్ మిషన్లలో ఈ కార్డును స్వైప్ చేయకుండానే కేవలం టచ్ ద్వారా సురక్షిత లావాదేవీలు చేయవచ్చు. ఈ కార్డుకు 2021 మార్చి వరకు ఎలాంటి ఎంట్రీ రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఐఆర్‌సీటీసీ బుక్ చేసే టికెట్లపై ఒక శాతం డిస్కౌంట్ కుడా అందిస్తుంది. కొత్త ఐఆర్‌సీటీసీ-ఎస్‌బీఐ రుపే క్రెడిట్ కార్డుతో, వినియోగదారులు టికెట్లు బుక్ చేసుకోవడంతోపాటు ఆన్‌లైన్ షాపింగ్, డిస్కౌంట్ కూడా పొందవచ్చు. రైలు టిక్కెట్ల కొనుగోలు ద్వారా వచ్చిన రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయవచ్చు.
ముఖ్యంగా బిగ్‌బాస్కెట్, ఫుడ్‌ఫర్ ట్రావెల్.ఇన్, ఎజియో, మొదలైన వాటిలో షాపింగ్ చేసేటప్పుడు వినియోగదారులు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. మెడ్ లైఫ్ ద్వారా మెడిసిన్స్ పై 20 శాతం దాకా డిస్కౌంట్ కూడా లభిస్తుంది.