టాలీవుడ్: పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు తియ్యడం మొదలుపెట్టిన తర్వాత సంతకం చేసిన మొదటి సినిమా ‘వకీల్ సాబ్‘. హిందీ మూవీ ‘పింక్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. హిందీ లో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రలో పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. హీరో మార్కెట్ దృష్ట్యా హీరోయిజం కోసం చాలా సీన్స్ ఆడ్ చేసినట్టు టాక్. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం సి ఏ దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతుంది.
ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసారు సినిమా టీం. ఒక వైపు మహాత్మా గాంధీ, ఒక వైపు అంబెడ్కర్ ఫొటోలతో మధ్యలో ‘క్రిమినల్ లా’
పట్టుకొని సీరియస్ గా చూస్తున్న లాయర్ గెటప్ లో పవన్ కళ్యాణ్ కనిపించాడు.చేతిలో బేస్ బాల్ బాట్ చూస్తే ఇదేదో ఫైట్ సీన్ లా అనిపిస్తుంది. ఈ మోషన్ పోస్టర్ కి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన ‘సత్యమేవ జయతే..’ అనే బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు మూడేళ్ళ తర్వాత తమ అభిమాన హీరో సినిమాకి సంబంధించిన పోస్టర్ రావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘వకీల్ సాబ్’ కరోనా వైరస్ పరిస్థితుల వలన నిలిచిపోయింది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీగా రాబోతున్న ‘వకీల్ సాబ్’ కోసం అభిమానులు చాలారోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.