హైదరాబాద్: ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే సినిమా ద్వారా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జె. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తన రెండవ సినిమాని ప్రకటించాడు. క్షణం, ఘాజి వంటి సినిమాలని నిర్మించిన మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్వరూప్ రెండవ సినిమాగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో 8వ చిత్రంగా రానున్న ఈ మూవీ అనౌన్సమెంట్ పోస్టర్ రిలీజ్ చేసారు.గోడ పై కోడిపుంజు నిలుచొని ఉండగా.. గోడపై వాంటెడ్ పోస్టర్ అతికించబడి ఉంది. అతన్ని పట్టుకున్న వారికి 50 లక్షల రివార్డ్ అని ప్రకటించబడి ఉంది. కొంచెం వింటేజ్ లుక్ తో ఉన్న పోస్టర్ చూస్తుంటే మరొక డిఫరెంట్ సినిమా లాగా అనిపిస్తుంది.
మొదటి సినిమాకి నెల్లూరు బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న డైరెక్టర్ రెండవ సినిమాకి తిరుపతి బ్యాక్ డ్రాప్ ఎంచుకుంటున్నట్టు తెలియచేసారు. ప్రస్తుతం మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కలిపి చేస్తుకుంటూ వెళ్తున్నారు. మొన్నటి వారికి వైవిధ్యమైన చిన్న సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్న వీళ్ళు ఇపుడు ఏకంగా మెగా స్టార్ట్ చిరంజీవి తో ‘ఆచార్య’, అక్కినేని నాగార్జున తో ‘వైల్డ్ డాగ్’ నిర్మిస్తున్నారు. ఇటు పెద్ద హీరోలతో సినిమాలు చేసుకుంటూ అటు చిన్న సినిమాలు చేయడం కూడా మంచి పరిణామం.