బాలీవుడ్: కంగనా అటాకింగ్ ఆటిట్యూడ్ అందరికి తెలిసిన విషయమే. డైరెక్టర్స్ తో, టెక్నిషియన్స్ తో వివాదాలు పెట్టుకోవడం, మధ్యలో కథలు మార్చేయడం, తానే దర్శకత్వం వహించడం. ఇపుడు కొత్తగా తానే ప్రొడ్యూసర్ గా కూడా సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తాను సుశాంత్ మరణం తర్వాత వార్తల్లో బాగా నిలుస్తుంది. డ్రగ్స్ అని , నేపాటిసమ్ అని రక రకాల అంశాల పైన తన స్పందన గట్టిగానే వినిపిస్తుంది. బాలీవుడ్ బడా సెలెబ్రిటీ ల పైన, హీరోయిన్ ల పైన తన విమర్శలు ఇంకా చాలా గట్టిగా ఉంటాయి. వీటిపై కంగనా ని కూడా చాలా మందే విమర్శించారు.
అయితే కంగనా పద్దతిని చూసి చాల మంది ఆమెతో పని చేయడానికి నిరాకరిస్తున్నారు. తన స్ట్రైట్ ఫార్వర్డ్ ఆటిట్యూడ్ ని మెచ్చుకునే వాళ్ళు ఉన్నా కానీ తనతో పెట్టుకోవద్దు అనే వాళ్ళు ఇంకా ఎక్కువే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇండియా మొత్తం లో పేరు పొందిన సినిమాటోగ్రాఫర్ ‘పి సి శ్రీరామ్‘ కంగనా తో సినిమా చేయబోనని చెప్పిన మాటలు టాక్ అఫ్ ఇండస్ట్రీ అయ్యాయి. ఆయన ఎంత సౌమ్యుడో అందరికి తెలుసు. అంత పేరున్నప్పటికీ ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడాడు. తన మాటల కన్నా తన పని ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల ద్వారా రుచి చూపించాడు. ఆయన కంగనా తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ కంగనా ఉండడం వల్ల ఆ సినిమా నుండి తప్పుకుంటున్నాను అని ఒక అఫిషియల్ ప్రకటన ఇచ్చాడు ‘పి సి శ్రీరామ్’ .