హైదరాబాద్: అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి ప్రవేశించి ఇప్పటికే మూడు సినిమాలు విడుదల చేసి నాల్గవ సినిమా షూటింగ్ ముగించే పనిలో ఉన్నాడు అఖిల్. తన నాల్గవ సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’ సెట్స్ పై ఉంది. సమ్మర్ విడుదల ప్లాన్ చేసారు కానీ కరోనా వల్ల అన్నిటికి బ్రేక్ పడింది. కొంత కాలంగా తన తదుపరి సినిమా గురించి కథా చర్చలు జరుగుతున్నాయి, సురేందర్ రెడ్డి తో సినిమా అంటున్నారు అని రూమర్స్ వచ్చాయి కానీ అధికారిక ప్రకటన ఏది రాలేదు. అయితే ఎట్టకేలకు అఖిల్ తన తదుపరి సినిమా సురేందర్ రెడ్డి తో చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఏ కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. స్టైలిష్ ఎంటర్టైనర్ సినిమాలు తియ్యడం లో సురేందర్ రెడ్డి అందె వేసిన చెయ్యి. ఆయన ఇంతకముందు తీసిన సినిమాలు చూస్తేనే ఆ విషయం తెలుస్తుంది. ఇపుడు అఖిల్ ని పెట్టి ఎలా తియ్యబోతున్నాడో చూడాలి. ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి , కథా రచయిత వక్కంతం వంశీ మళ్ళీ జత కట్టబోతున్నారు. వీళ్లిద్దరి హిట్ కాంబినేషన్ లో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కడానికి వీళ్లిద్దరు జత కలిశారు. అన్నీ బాగున్నా కానీ ఇప్పటివరకు అఖిల్ కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. ప్రస్తుతం చేస్తున్న నాల్గవ సినిమా కూడా క్లాస్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్. ఆ సినిమా పైన అఖిల్ కి పెద్ద అంచనాలే ఉన్నాయి. ఇలా మంచి సినిమాలని లైన్ లో పెట్టి విజయ పథం లో నడిచే ప్లాన్ లో అఖిల్ ఉన్నట్టు తెలుస్తుంది.