హైదరాబాద్: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ నటించిన సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’. మార్చ్ కి ముందే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా సమ్మర్ లో విడుదల కావాల్సింది. కానీ కరోనా వల్ల విడుదల ఆలస్యం అయింది. థియేటర్లు ఇప్పుడే తెరుచుకునే వీలు కనపడకపోవడం తో మెల్లగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు అన్ని ఓటీటీ లలో విడుదల అవుతున్నాయి. మొన్ననే నాని ‘వి’ సినిమా కూడా ప్రైమ్ లో విడుదల అయింది. ఇపుడు ఆ సినిమా బాటలోనే రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ కూడా ఓటీటీలో విడుదల అవబోతుంది. ఈ సినిమా అక్టోబర్ 2 నుండి అల్లు వారి ఆహా ఓటీటీ లో విడుదల అవబోతుంది.
ఈ చిత్రానికి ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ సినిమాకి దర్శకత్వం వహించిన ‘విజయ్ కుమార్ కొండా’ దర్శకత్వం వహించడం కొంత కలిసొచ్చే అంశం. యూత్ ఫుల్ ఎలెమెంట్స్ తో పాటు, ఫామిలీ ఎమోషన్స్ తో సినిమా రూపొందించడం లో ఈ డైరెక్టర్ కి మంచి పేరుంది. ఈ సినిమా ట్రైలర్, టీజర్ లు చూసిన కూడా ఆ విషయం అర్ధం అవుతుంది. ఇప్పటి వరకి ఓటీటీ ల్లో విడుదల అయినా సినిమాలు ఏవి ఆశించిన ఫలితాలు రానప్పటికీ నిర్మాతలు మరొక ఆప్షన్ లేక ఓటీటీ ల బాట పడుతున్నారు. వరుస ప్లాపుల్లో ఉన్న రాజ్ తరుణ్ ఈ సినిమా పైన చాలా ఆశలే పెట్టుకున్నాడు. కానీ అనుకోకుండా ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేయాల్సి వచ్చింది. దీని తర్వాత సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ కూడా అక్టోబర్ చివర్లో ఓటీటీ లో విడుదల అవబోతుంది.