న్యూఢిల్లీ: శాంసంగ్ గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ వంటి పరిశ్రమలో తొలి వినూత్న ప్రైవసీ ఫీచర్లతో శాంసంగ్ నూతన ప్రమాణాలను నెలకొల్పింది. శాంసంగ్ ప్రైవసీ ఇన్నోవేషన్స్ క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ గెలాక్సీ ఏ51, ఏ 71లపై అందుబాటులోకి వచ్చాయి.
మీ ప్రైవేట్ యాప్స్, కంటెంట్ భద్రతపై ఎలాంటి ఒత్తిడి, విచారం లేకుండా మీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుతూనే అల్ట్‌జడ్ లైఫ్ మీకు వినోదం అందిస్తుంది.ఫీచర్ భాగస్వామి, హెచ్‌టీ బ్రాండ్ స్టూడియో మిలీనియల్స్, జడ్ జనరేషన్ వారి స్మార్ట్ ఫోన్లను ఫోటోలు తీసుకోవడం నుంచి గేమ్స్ ఆడటం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండటం, గూగుల్ సమాచారం వెతకడం సహా అన్ని విషయాల్లోనూ వాడుతున్నారు.
ఫోన్ మీ చేతిలో ఉన్నంతవరకూ సురక్షితంగా భావిస్తుంటారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మీ స్మార్ట్ ఫోన్ వైపు చూస్తే మీరు నిజంగా వారికి ఇచ్చేందుకు తిరస్కరిస్తారా..? మీ ఫోన్‌ను వారు చేతుల్లోకి తీసుకుని కెమెరాతో ఫోటోలు తీసేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తే మీ ప్రైవేట్ కంటెంట్ బయటకు వచ్చే అవకాశాలు అధికం.
అల్ట్‌జడ్ లైఫ్‌లో చేరడం ద్వారా మీ వ్యక్తిగత జీవితం వ్యక్తిగతంగానే నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది. క్విక్ స్విచ్ పేరుతో పరిశ్రమలోనే తొలి ప్రైవసీ ఫీచర్‌ను శాంసంగ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ స్మార్ట్ ఫోన్ మరొకరికి ఇచ్చినప్పుడు మీకుండే యాంగ్జైటీని ఇది నివారిస్తుంది. పవర్ కీని డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుంది. శాంసంగ్ ‘మేక్ ఫర్ ఇండియా’ కార్యక్రమం కింద క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఫీచర్లు గెలాక్సీ ఏ71, గెలాక్సీ ఏ51లపై అందుబాటులో ఉంటాయి.