హైదరాబాద్: షూటింగ్ దాదాపు పూర్తి చేసుకొని సమ్మర్ లో విడుదల అవ్వాల్సిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్ ‘. కరోనా కారణంగా ఇన్నాల్లు ఆగిపోయింది. ఈ మధ్య షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టి మిగిలిన షూటింగ్ పార్ట్ కూడా ఫినిష్ చేసారు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటిస్తున్న ఈ సినిమాలో, తేజ్ కి జోడి గా ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభ నటేష్ నటిస్తుంది. ఇప్పటికి విడుదలైన టీజర్, పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే కొత్త దర్శకుడు పరిచయం అవ్వబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పైన బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
వరుస ప్లాప్ ల తర్వాత ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’ లాంటి హిట్లు కొట్టిన సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా పైన కూడా గట్టి ఆశలే పెట్టుకున్నాడు. షూటింగ్ చివరి రోజు సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ ట్వీట్ చేసాడు. ‘సరదా సరదాగా సాగిన మా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగ్ పూర్తయింది. సెట్ మీద ఒక్క రోజు కూడా డల్ మూమెంట్ లేదు. మాస్క్ వేసుకుని షూటింగ్ చేసిన సందర్భాలైనా సరే, మాస్క్ ధరించకుండా చేసిన సందర్భాలైనా సరే.. అంతా సరదాగా గడిచిపోయిదంటూ’ సాయి ధరమ్ తేజ్ యూనిట్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ చేస్తారు అని రూమర్స్ వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు ఏదీ రాలేదు.