హైదరాబాద్: తెలుగు టెలివిజన్ రియాలిటీ షోల్లో ఇప్పటివరకు అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన షో ‘బిగ్ బాస్‘. ఇప్పటి వారికి మూడు సీజన్ లు ముంగించుకుని మొన్ననే నాల్గవ సీజన్ ప్రారంభం అయింది. ప్రారంభం అయి మొదటి వారం పూర్తి చేసుకుంది. ప్రతి వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగం లో ఈ వారం అంటే మొదటి వారం లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ డైరెక్టర్ ‘సూర్య కిరణ్’. ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరూ పెద్దగా తెలియదు అనేటువంటి రూమర్స్ ఉన్నా కూడా జనాలు ఎక్కువమంది ఇళ్లకే పరిమితం అవడం వల్లనో ఏమో తెలియదు కానీ టెలివిజన్ టీఆర్పి రేటింగ్స్ మాత్రం ఈ షో కి దూసుకెళ్తున్నాయి.
సీజన్ 3 హోస్ట్ చేసిన నాగార్జున నే ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా చేస్తున్నాడు. ఇప్పటివరకైతే ఈ షో కి అంత క్రేజీ కంటెస్టెంస్ట్ లేరు కాబట్టి వైల్డ్ కార్డు లో ఇంకో ముగ్గురు టఫ్ కాండిడేట్స్ ని పంపించే ఆలోచనలో బిగ్ బాస్ యాజమాన్యం ఉన్నట్టు రూమర్ కూడా చక్కర్లు కొడుతోంది. మొదటి వారం పెద్దగా హైట్స్ అండ్ లోస్ లేకుండా షో ఫ్లాట్ గా నడించింది. ముందు ముందు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్స్ తో షో మరింత రక్తి కట్టించే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.