హైదరాబాద్: చాలా రోజులు జాగ్రత్త గా ఉండి ఇంకా ఈ కరోనా ఉదృతి ఇపుడిపుడే తగ్గేలా లేదని అందరూ ఎవరి పనుల్లో వాల్లు నిమగ్నం అయిపోతున్నారు. కానీ ఎంత కాదన్నా నలుగురిలో తిరిగినప్పుడు, షూటింగ్స్, షోస్ చేసేప్పుడు ఎదో ఒక దగ్గర కరోనా అంటక మానదు. ప్రస్తుతం అదే జరుగుతుంది టాలీవుడ్ లో. బండ్ల గణేష్ తో మొదలైన కరోనా , సీరియల్ యాక్టర్స్ ఇంకా కొందరు పేర్లు బయటకి రాలేదు కానీ చాలా మందికే వచ్చింది. ఈ మధ్యనే మెగా బ్రదర్ నాగబాబు కి కూడా కరోనా సోకినట్టు ఆయన ధ్రువీకరించారు. “ఓ వ్యాధి వచ్చిందని ఎప్పుడూ బాధగా ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని ఇతరులకు సాయం చేయడానికి దొరికిన అవకాశంగా మలుచుకోవచ్చు. నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. త్వరలోనే దీన్ని జయించి ప్లాస్మాదాతగా మారుతాను” అని నాగబాబు సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. డాన్స్ మాస్టర్ శేఖర్ కి కూడా కరోనా వచ్చి తగ్గిపోయింది.
ఆ మధ్యన దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబానికి మొత్తం కరోనా వచ్చింది. ఇపుడు కొత్తగా 80 , 90 ల్లో తెలుగులో క్లాసిక్ మూవీస్ అందించిన దర్శకుడు ‘సింగీతం శ్రీనివాసరావు ‘ కు కరోనా సోకినట్టు అయన తెలిపారు. ఎపుడు పాజిటివ్ గా ఉండే నాకు కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చిందని చాలా చమత్కారంగా చెప్పారు అయన. హోమ్ ఐసోలేషన్‌లో భాగంగా ప్రత్యేక గదిలో ఉన్నానని, ఇది తనకు హాస్టల్ రోజులను గుర్తు చేస్తోందంటూ చమత్కరించారు. మాస్కులు పెట్టుకున్నా, భౌతిక దూరం పాటించినా, ఎన్ని జాగ్రత్తలు పడ్డా ఆ వైరస్ తనకు సోకిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.