fbpx
Thursday, January 2, 2025
HomeSportsచెన్నైకి ఈ సారి టైటిల్‌ అందని ద్రాక్షేనా?

చెన్నైకి ఈ సారి టైటిల్‌ అందని ద్రాక్షేనా?

CSK-LESS-CHANCES-TO-WIN-IPL

దుబాయ్‌ : ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభం కాకముందే టైటిల్‌ ఎవరు గెలుస్తారనేదానిపై మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు ఎవరికి వారు తమకు నచ్చినట్లుగా జోస్యం చెబుతున్నారు. ఒకరు ముంబై లేదా చెన్నై గెలుస్తుందని అంటే, మరొకరు ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

ఐతే భారత మాజీ ఆటగాడు, లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ మాత్రం ఐపీఎల్‌ 2020 టైటిల్‌ను చెన్నైసూపర్‌ కింగ్స్‌ గెలవడం కష్టమేనంటూ భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పిన ధోనికి మాత్రం ఈ ఐపీఎల్‌ లాభదాయకంగా మారుతుందని.. ఎందుకంటే అతనిపై ఒత్తిడి అంతగా ఉండకపోవడమే కారణమని తెలిపాడు.

సురేశ్‌ రైనా, హర్బజన్‌ లేని లోటు చెన్నై జట్టులో బాగా కనబడుతోంది. ఇప్పటికే ఇద్దరు సీనియర్ స్టార్‌ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన చెన్నై జట్టులో ఉన్న యువ ఆటగాళ్లతో ఎంతమేరకు రాణిస్తుందనేది అనుమానమే. ఎందుకంటే జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లు ఉంటేనే సమతూకంగా ఉంటుందని, కానీ చెన్నైలో ప్రస్తుతం అది కొరత గా ఉందన్నారు.

దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ గెలవడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది. అయితే జట్టులో సీనియర్‌ ఆటగాడిగా, కెప్టెన్‌గా ఉన్న ఎంఎస్‌ ధోనికి మాత్రం ఐపీఎల్‌ లాభదాయకంగా ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన ధోనికి ఒత్తిడి లేకపోవడం దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉంది. ఒక కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా నడిపిస్తాడనంలో సందేహం లేదు. అయితే యువ ఆటగాళ్లు ఎంతమేర సహకరిస్తారనేది చూడాలి, అంటూ తెలిపాడు.

ఇక ఐపీఎల్‌ 13వ సీజన్‌కు గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో చెన్నై జట్టు కేవలం నలుగురిని మాత్రమే కొనుగోలు చేసింది, మిగతా అందరిని తనవద్దే ఉంచుకొని డాడీస్‌ ఆర్మీ ట్యాగ్‌గా ముద్ర వేయించుకుంది. రైనా, హర్భజన్‌ గైర్హాజరీలో చెన్నై జట్టులో ధోని, డుప్లెసిస్‌, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్‌ లాంటి సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఇక బౌలింగ్‌లో జోష్‌ హాజల్‌వుడ్‌, డ్వేన్‌ బ్రేవో, ఇమ్రాన్‌ తాహిర్‌, మిచెల్‌ సాంట్నర్‌లు ఉన్నారు. కాగా చెన్నై జట్టు ముంబై ఇండియన్స్‌తో సెప్టెంబర్‌ 19న తమ తొలి మ్యాచ్‌ ఆడనున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular