fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsసైలెంట్ గా ఓటీటీ లో 'నిశ్శబ్దం'

సైలెంట్ గా ఓటీటీ లో ‘నిశ్శబ్దం’

Anushka NishabdamMovie ReleasingOnPrime

టాలీవుడ్: సినిమా ప్రకటించినప్పటినుండి సినిమా పేరుకు తగ్గట్టే ఈ సినిమా పనులు కూడా నిశ్శబ్దంగా సాగిపోతున్నాయి. ఎపుడో జనవరి, ఫిబ్రవరి లో విడుదల కావాల్సిన సినిమా ఆలస్యం అవడం, సినిమా ఆడియో విడుదల లాంటి కార్యక్రమాలు కూడా సైలెంట్ గా అవడం, ఆ తర్వాత అపుడో ఇపుడో అంటూ రిలీజ్ డేట్ తో సైలెంట్ గా దోబూచులాడడం, ఆ తర్వాత కరోనా వచ్చి థియేటర్ లు మూతబడిపోవడం తో ఈ సినిమా అప్డేట్ కూడా అంతకుముందు లాగే సైలెంట్ గా ఉంది. ఈ మధ్యనే ఓటీటీల్లో విడుదల అవ్వబోయే సినిమాలు పెరుగుతూ ఉండడంతో ఆ జాబితాలోకి ఈ సినిమా కూడా సైలెంట్ గా వచ్చి చేరింది.

అనుష్క, మాధవన్ జంటగా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అక్టోబర్ 2 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదల అవబోతుంది. ఈ విషయాన్నీ ఇవాల మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మెజారిటీ భాగం ఓవర్ సీస్ లోనే షూటింగ్ జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ – వివేక్ కూచిభోట్ల, కోన ఫిల్మ్ కార్పొరేషన్ కోన వెంకట్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో ఇంకా అంజలి, షాలిని పాండే , శ్రీనివాస్ అవసరాల, సుబ్బా రాజు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే ఇంతక ముందే అక్టోబర్ 2 వ తేదీన రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ కూడా ఆహా ఓటీటీ లో విడుదల అవబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఒకప్పుడు ఒకే రోజు విడుదలైన సినిమాలు థియేటర్లను పంచుకునేవి ఇపుడు ఓటీటీలని పంచుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular