హైదరాబాద్: తెలుగు లో మంచి సక్సెస్ లు సాధించి టాప్ రేంజ్ హీరోగా ఎదుగుతాడు అనుకున్న సిద్దార్థ్ అనుకోకుండా టాలీవుడ్ నుండి కనుమరుగయ్యారు. కెరీర్ మొదట్లో తన మాతృ బాష తమిళ్ కన్నా తెలుగు లోనే ఎక్కువ విజయాలు సాధించి ఇక్కడే ఎక్కువ పేరు సంపాదించాడు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట లాంటి విజయాల తర్వాత ఇంకా కొన్ని హిట్స్ , ప్లాప్ లు, తెలుగు ఇండస్ట్రీ పై చేసిన కొన్ని కామెంట్స్ వల్ల ఇండస్ట్రీ లో నామ రూపాలులేకుండా అయిపోయింది. మధ్యలో కొన్ని డబ్బింగ్ సినిమాలు వచ్చినా కూడా అంతగా ఆడలేదు. కానీ తమిళ్ లో మంచి విజయాలే సాధించాడు సిద్దార్థ్.
ఇపుడు మళ్ళీ ఒక డైరెక్ట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ కి రాబోతున్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. RX100 డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో , ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ‘మహా సముద్రం’ అనే ఒక సినిమా రూపొందించబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంచిన అప్డేట్ ఈ మధ్యనే విడుదల చేసారు. ఇందులో శర్వానంద్ హీరోగా నటించబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా కథకి సంబంధించి ఇది మల్టీ స్టారర్ అవడం తో మరొక హీరో గా సిద్దార్థ్ ని ఎంచుకున్నారు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఈ సినిమా ద్వారా మళ్ళీ టాలీవుడ్ లో మంచి ఆఫర్లు రావాలని ఆశిద్దాం.