టాలీవుడ్: జపాన్ లో మన సినిమాలు అడపా దడపా విడుదల అవుతాయి. ఒకప్పుడు జపాన్, మలేషియా, సింగపూర్ లాంటి ఏషియన్ కంట్రీస్ లో మన సినిమాలు విడుదల అవడం అంటే అవి కేవలం రజిని కాంత్ సినిమాలే అయి ఉండేవి. కానీ పరిస్థితి మారింది. మన మార్కెట్ కూడా గణనీయంగా పెరిగింది. బాహుబలి తర్వాత అక్కడ టాలీవుడ్ సినిమాలకి పెద్ద మార్కెట్ తయారయ్యింది. బాహుబలి టాయ్స్ అంటే అక్కడ పిచ్చి మోజు కూడా. తర్వాత మెల్లిగా తెలుగు సినిమాలు కూడా అక్కడ విడుదల అవడం, కెల్లెక్షన్స్ మంచిగానే రావడం మొదలయ్యాయి. లాక్ డౌన్ కి ముందు సాహో కూడా అక్కడ విడుదల అయి మంచి టాక్ సంపాదించింది.
2019 లో విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఇక్కడ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే. ఇపుడు కరోనా తర్వాత జపాన్ లో విడుదలైన మొదటి తెలుగు సినిమాగా ఆత్రేయ నిలిచింది. అక్కడ కూడా మంచిగానే ఆడుతుందని టాక్. ఈ సినిమా ద్వారా ‘నవీన్ పోలిశెట్టి‘ లాంటి మంచి నటుడు ఇండస్ట్రీ జనాల కళ్ళలో పడ్డాడు. ఆ తర్వాత నవీన్ కి కూడా మంచి అవకాశాలు వచ్చి చేరుతున్నాయి. ఈ సినిమా డైరెక్టర్ కూడా తన రెండవ సినిమాని ఈ మధ్యనే ప్రకటించాడు. ఈ సినిమాలో ఏజెంట్ బాబీ గా నటించిన సుహాస్ కూడా హీరోగా ఒక సినిమాతో వచ్చే నెలలో ఓటీటీ లో పలకరించబోతున్నాడు.