టాలీవుడ్: తెలుగు లో ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో మంచి ఆరంభమే లభించింది ఆదా శర్మ కి, కానీ ఆ తర్వాత అంత పేరు తెచ్చే పాత్రలేవీ ఆదా చెంతకి రాలేదు. వచ్చినా అరా కోర పాత్రల్లో కూడా అంతగా మెప్పించిందేమి లేదు. చెప్పాలంటే ఇప్పటి వరకు సోలో హీరోయిన్ గా ఫుల్ మూవీస్ చేసినవి కూడా తక్కువే అవి కూడా అంతగా జనాలకి రీచ్ అవలేదని చెప్పుకోవచ్చు. ఆదా శర్మ ప్రస్తుతం ‘?’ అనే సస్పెన్సు థ్రిల్లర్ లో నటిస్తుంది. ప్రశార్ధకమే (?) ఈ సినిమా టైటిల్. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది.
మూడు ఫేసెస్ తో ఉన్న ఆదా శర్మ ఇందులో కనిపిస్తుంది. ఒక ఫేస్లో సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా, మరొక ఫేస్ లో కళ్లద్దాలు పెట్టుకొని కొద్దిగా గాయాలతో , మరొక ఫేస్ లో కళ్లద్దాలు లేకుండా ఎక్కువ గాయాలతో కనిపిస్తుంది. శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ ద్వారా గౌరీ కృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా విప్రా అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. రఘు కుంచె ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.