టాలీవుడ్: తనదైన ఆటిట్యూడ్ తో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్సేన్. ఫలక్ నమ దాస్ ద్వారా బాగా పాపులర్ అయిన ఈ హీరో అంతకముందు ‘వెళ్ళిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమాలు చేసాడు. అయితే వాటి ద్వారా రాని పేరు ‘ఫలక్ నమ దాస్’ ద్వారా వచ్చింది, జనాలకి కూడా ఈ సినిమానుండే విశ్వక్సేన్ అంటే ఎవరో తెలిసింది. ఆ తర్వాత నాని నిర్మాణం లో వచ్చిన థ్రిల్లర్ ‘హిట్’ సినిమా కూడా మంచి విజయాన్నే సాధించింది. అయితే మొదటి నుండి ఒకే ఆటిట్యూడ్, ఒకే లుక్ ని ఫాలో అవుతున్నాడు అనే కామెంట్ విశ్వక్ పై ఉంది. ఇప్పుడున్న హీరోలు అందరూ ఒక్కో సినిమాకి ఒక్కోలా రూపాంతరం చెందుతూ కొందరైతే ఒక సినిమాలోనే రక రకాల గెటప్ లు వేస్తూ తమ సత్తా చాటుతున్నారు.
ప్రస్తుతం మాస్ కా దాస్ కూడా తన లుక్ మార్చాడు. ఒక కొత్త ట్రెండీ లుక్ ఫోటో ఒకటి విడుదల చేసాడు. ఇది అందర్నీ ఆకట్టుకుంటుంది. స్టైలిష్ లుక్ తో పాటు చివర్లో మాస్ టచ్ ఇచేలా నోట్లో బీడీ పెట్టుకొని అటు క్లాస్ ని ఇటు మాస్ ని అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ఈ పిక్ పెట్టి ‘లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్’ అని స్టేట్మెంట్ ఇచ్చాడు విశ్వక్. దీన్ని బట్టి చూస్తుంటే ఇది తన తదుపరి సినిమా లుక్ అని అర్ధం అవుతుంది. ప్రస్తుతం విశ్వక్ ‘పాగల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘పాగల్’ చిత్రంతో నరేష్ కొప్పల్లి అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ లో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.