హైదరాబాద్: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ‘రాధే శ్యామ్’ తర్వాత తన 21 వ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ లో ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనె ని తీసుకున్నారు. ప్రస్తుతుకం ఈ సినిమా టీం నుండి మరొక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోకి మరొక లెజెండరీ క్లాసిక్ డైరెక్టర్ వచ్చాడు. టాలీవుడ్ కి ‘ఆదిత్య 369′, భైరవద్వీపం’ , ‘మయూరి’, ‘పుష్పక విమానం’ , ‘మైఖేల్ మదన్ కామరాజు’ లాంటి ఎన్నో క్లాసికల్ హిట్స్ అందించిన డైరెక్టర్ ‘సింగీతం శ్రీనివాసరావు‘. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ప్రభాస్ 21 సినిమా కోసం పని చేయబోతున్నాడు.
సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్ కి స్క్రిప్ట్ మెంటర్ గా వ్యవహరించనున్నారు. నేడు సింగీతం బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ అధికారికంగా తెలియజేస్తూ ”మేము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల ఇప్పటికి నెరవేరనుంది. సింగీతం శ్రీనివాసరావు గారిని మా ఎపిక్ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఆయన క్రియేటివ్ సూపర్ పవర్స్ ఖచ్చితంగా మాకు మార్గదర్శకంగా ఉంటాయి” అని తెలిపారు.సింగీతం శ్రీనివాస్ గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారని, క్వారంటైన్ పీరియడ్ లో కూడా చిత్ర యూనిట్ తో కలిసి ఉన్నాడని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షనల్ జోనర్ లో ఉండబోతోందని తెలుస్తోంది.