బాలీవుడ్: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య జరిగినప్పటి నుండి బాలీవుడ్ లో ఎదో ఒక రూపం లో ఎదో ఒక వివాదం నడుస్తుంది. మొదలు సుశాంత్ మరణం మీద బాగా చర్చ జరిగింది. ఆ తర్వాత అది ఆత్మ హత్య కాదు హత్య అని ఆ ఇన్వెస్టిగేషన్ ని సిబిఐ కి అప్పగించడం జరిగింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కాస్త సుశాంత్ మీద నుండి డ్రగ్స్ వైపు వెళ్ళింది. ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అంతా డ్రగ్స్ చుట్టూనే తిరుగుతుంది.
సుశాంత్ మరణం దగ్గరనుండి నేపాటిజమ్ పైన బాగానే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కంగనా కూడా నేపాటిజమ్ పైన విరుచుకుపడింది. ఇందులో భాగంగా మాట మాట పెరిగి ఇది కాస్త కంగనా VS శివ సేన పార్టీ మాటల యుద్ధంలా తయారైంది. ఇదే క్రమంలో కంగనా భవంతి ని కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉందని రెండు రోజుల్లో కూల్చడం జరింగింది. దీనిపై కంగనా గట్టిగానే స్పంచించింది. ముంబై ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చి అలాంటి పరిస్థితులు ఉన్నాయని పోల్చింది.
ప్రస్తుతం బాలీవుడ్ మళ్ళీ మీటూ వివాదాలతో వార్తల్లో నిలిచింది. తెలుగు లో ప్రయాణం, ఊసరవెల్లి సినిమాలు తీసిన పాయల్ ఘోష్ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పైన లైంగిక ఆరోపణలు చేసింది. ఈ డైరెక్టర్ నే కాకుండా రిచా చద్దా, మహి గిల్, హుమా ఖురేషి పైన కూడా ఆరోపణలు చేసింది. కంగనా కూడా పాయల్ కి సపోర్ట్ గ నిలిచింది. అయితే ఈ విషయం పై అనురాగ్ కశ్యప్ తో పని చేసిన చాలా మంది హీరోయిన్ లు దగ్గరి వాళ్ళు అనురాగ్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అనురాగ్ గురువు రామ్ గోపాల్ వర్మ కూడా అనురాగ్ గురించి తనకి చాలా తెలుసనీ అలంటి వాడు కాదని కితాబిచ్చాడు. అనురాగ్ తో వర్క్ చేసిన తాప్సి కూడా అనురాగ్ అమాయకుడని, హుమా ఖురేషి, మహి గిల్, రిచా చద్దా కూడా పాయల్ అభియోగాలని కొట్టిపారేసారు. అలాగే పాయల్ కి కోర్ట్ నోటీసులు కూడా పంపించింది. ఇది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
ఇలా గత మూడు నాలుగు నెలలుగా బాలీవుడ్ ఎదో ఒక వివాదం తో వార్తల్లో నిలుస్తుంది. మరి ఇది కొన్ని కేసుల్ని తప్పు దారి పట్టించడానికే లేక నిజంగానే ఇలాంటివి జరిగాయా అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది. సినిమాలు లేకపోయినా కూడా ఇలాంటి వార్తలతో జనాలకి ఒక విధంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుందనే చెప్పుకోవాలి.