న్యూఢిల్లీ: యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలు కరోనా నేపథ్యంలో వాయిదా వేయాల్సిందిగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. పిటిషన్‌దారు యూపీఎస్సీ నుంచి రిలాక్సేషన్ కోరినట్లయితే, అది మర్యదపూర్వకంగా ఒప్పించేదిగా ఉండాలని సూచించింది.
యూపీఎస్సీ బోర్టు మాత్రం పరీక్షలు చెప్పిన తేదీకే పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపుతుందని కోర్టు ఇవాళ స్పష్టం చేసింది. అయితే పరీక్ష రాసే అభ్యర్థుల రవాణాకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని యూపీఎస్సీ ఇప్పటికే రాష్ట్రాలను కోరిందని కోర్టు తెలిపింది.
కరోనా నేపథ్యంలో అసాధారణ పరిస్థితులు తలెత్తాయని, అందుకు పరీక్షలు వాయిదా వేయాలని పిటిషనర్లు వాదించారు. అయితే ఇప్పటికే పరీక్ష నిర్వహణ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని యూపీఎస్సీ మరోసారి స్పష్టం చేసింది.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీనే పరీక్ష జరుగుతుందని తెలిపింది. ఈమేరకు యూపీఎస్సీ సుప్రీంకోర్టుకు తన అఫిడవిట్‌ను సమర్పించింది. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేస్తే వచ్చే ఏడాది జూన్ 27న జరిగే పరీక్షపై ఆ ప్రభావం పడుతుందని కోర్టుకు తెలిపింది.