టాలీవుడ్: ‘విశ్వక్ – ప్రపంచమంతా వ్యాపిస్తాడు’ అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ తెలుగు సినిమా టీజర్ ని గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు విడుదల చేసారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో ‘అజయ్ కతుర్వార్‘ అనే కొత్త నటుడు హీరోగా వస్తున్నాడు. వేణు ముల్కాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సామాజిక అంశాల మేళవింపులాగా అనిపిస్తుంది. గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తాడికొండ ఆనందం బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ లో వచ్చిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. టీజర్ ని బట్టి చూస్తే సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఈ సినిమా మంచి గుర్తింపు లభిస్తుందేమో అనిపిస్తుంది.
‘ఎన్నారైలకేమో బాధ్యత లేదు.. ఇక్కడున్న వాళ్లకి నిర్లక్ష్యం.. రైతువి నువ్వేం చేస్తున్నావ్ రా’ అంటూ రైతులపై, ‘ఇక్కడ చదివి బయటి దేశాలకి వెళ్తున్నారు.. ఇక్కడ లేని వాళ్ళకి ఇండియన్ అని పించుకునే హక్కు లేదు.. నీ తెలివి అక్కడ తగలెట్టకుండా ఆగస్టు 15 నాటికి ఇండియాకి వచ్చేయాలి’ అంటూ ఎన్నారై లపై, ‘లవ్, స్ట్రెస్, జాబ్స్, ఫామిలీ’ ఇలా యూత్ పై… ఇలా టీజర్ లో రకరాకాల అంశాలు టచ్ చేసాడు దర్శకుడు. ‘ది గ్రేట్ ఫార్మర్స్ సూసైడ్ గురించి’ అంటూ మరొక టాపిక్ తెచ్చి ఇలా ఎవరి పై ఈ సినిమా అనేది పక్కాగా చెప్పకుండా అన్నీటిపైనా తన మార్క్ చూపించేలా ఉన్నాడు దర్శకుడు. సినిమా టీజర్ లో చివరి ఫ్రేమ్ ‘దేశాన్ని దత్తత తీసుకునేవారు కావాలి’ అనే ప్లకార్డు తో ముగించి సినిమా పైన ఎంతో కొంత ఆసక్తి కలిగించాడని చెప్పొచ్చు.