శ్రీశైలం: కర్నూలు జిల్లాలోని శ్రీశైల మల్లన్న సన్నధిలో మరోసారి బంగారు, వెండి నాణాలు బయటపడ్డాయి. ఘంటామఠం పునర్నిర్మాణం పనుల్లో మఠంలోని నీటిగుండం వద్ద ఆదివారం ఈ నాణేలు లభ్యమయ్యాయి. లభ్యమైన వాటిలో 15 బంగారు నాణాలు, 18 వెండి నాణాలు, ఓ బంగారు రింగ్ ఉంది.
కాగా బయటపడ్డ ఈ నాణేలు బ్రిటీష్ కాలం నాటికి చెందినవి ఉన్నాయి. కాగా సెప్టెంబర్ 15న ఇదే తరహాలో శ్రీశైలం ఘంటామఠం ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న ఉపాలయ గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు, ఒక రాగి నాణెం, 3 తామ్ర శాసనాలు (రాగి రేకులు) లభించాయి. వీటిలో శివలింగం, నంది చిత్రీకరించిన రాగి రేకుపై ఒక రాజు శివలింగానికి నమస్కరిస్తున్నట్లుగా, మరో రేకుపై గోవును కూడా చిత్రీకరించినట్టుగా బయటపడింది. 97 వెండి నాణేలు విడిగా లభించగా, 148 నాణేలు ఇత్తడి పాత్రలో లభ్యమయ్యాయి.
శ్రీశైలంలోని ఘంటామఠం ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న ఉపాలయ గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు, ఒక రాగి నాణెం, 3 తామ్ర శాసనాలు (రాగి రేకులు) లభించాయి. ఉప స్థపతి జవహర్ మంగళవారం వీటిని గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. ఆలయ ఈవో కేఎస్.రామారావు వాటిని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ..5 ఇన్ టూ 9 అంగుళాల సైజులో ఉన్న రాగి రేకులపై నాగరి, కన్నడ లిపితో చెక్కిన శాసనాలు ఉన్నాయన్నారు.
శివలింగం, నంది చిత్రీకరించిన రాగి రేకుపై ఒక రాజు శివలింగానికి నమస్కరిస్తున్నట్లుగా ఉందని, మరో రేకుపై గోవును కూడా చిత్రీకరించారని చెప్పారు. 97 వెండి నాణేలు విడిగా లభించాయని, 148 నాణేలు ఇత్తడి పాత్రలో ఉన్నాయని తెలిపారు.