టాలీవుడ్: టాలీవుడ్ చందమామ గా పేరున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీ లో దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేసింది. దాదాపు పది సంవత్సరాలుగా ఇండస్ట్రీ లో నిలదొక్కుకొని ఇంకా చాల ఆఫర్లు చేతిలో ఉన్న ఈ హీరోయిన్ ఈ నెల చివర్లో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ముంబై కి చెందిన గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయాన్ని కాజల్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ లో వెల్లడించింది. అక్టోబర్ 30 న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ప్రకటించింది.
”నేను ఎస్ చెప్పాను. అక్టోబర్ 30న ముంబైలో గౌతమ్ కిచ్లును వివాహం చేసుకోబోతున్నానని మీతో పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మేము ఇద్దరం కలిసి కొత్త జీవితాలను ప్రారంభించబోతుండటం సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదాలు మాపై ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నా. ఇన్నేళ్ళుగా మీరు నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నేను మిమ్మల్ని ఇంకా అలరిస్తూనే ఉంటాను ” అని కాజల్ పేర్కొంది.అంతేకాకుండా సినిమాల్లో కొనసాగుతానని.. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని ప్రకటించింది.