fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsరేడియో మాధవ్ ఫస్ట్ లుక్

రేడియో మాధవ్ ఫస్ట్ లుక్

VijaySethupathi RadioMadhav MovieFirstLook

టాలీవుడ్: తమిళ్ టాప్ హీరో విజయ్ సేతుపతి, మలయాళం హీరో జయరాం నటించిన సినిమా ‘మార్కొని ముతాయ్’. ఈ సినిమా మలయాళం లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగు లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు.తెలుగులో ఈ సినిమాని ‘రేడియో మాధవ్’ అనే పేరు తో విడుదల చేస్తున్నారు. విజయ్ సేతుపతి మలయాళంలో నటించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని ఇవాళ విడుదల చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని టాలీవుడ్ హీరో ‘శ్రీ విష్ణు’ విడుదల చేసారు. ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయింది. కేరళ లోని ఒక చిన్న పట్టణంలో నడిచే ప్రేమ కథగా ‘రేడియో మాధవ్’ రూపొందించబడింది.

లక్ష్మి చెన్నకేశవ ఫిలిమ్స్ బ్యానర్ పై కృష్ణ స్వామి ఈ సినిమాని తెలుగు లో విడుదల చేస్తున్నారు. ఈయన ఇదివరకే దుల్కర్ సల్మాన్ నటించిన ‘హే పిల్లగాడా’ సినిమాని తెలుగు లో డబ్ చేసి విడుదల చేసారు. ఈ సినిమాకి సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. ఎఫ్ ఎం రేడియో బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమ కథ గా ఈ సినిమా తెరకెక్కించబడింది. విజయ్ సేతుపతి తన నిజ జీవితానికి దగ్గరలో ఉండే పాత్రని ఇందులో పోషించాడు. సైరా, 96 సినిమాల తర్వాత విజయ్ సేతుపతి కి తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఏర్పడడం తో ప్రొడ్యూసర్స్ ఈ సినిమాతో ముందుకు వస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular