టాలీవుడ్: యంగ్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసుకుంటూ పోతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ మరొక యంగ్ హీరో తో సినిమా ప్రకటించింది. ఈ లాక్ డౌన్ లో ఓటీటీ లో విడుదలైన ‘కృష్ణ అండ్ హిస్ లీల’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ‘సిద్దు జొన్నలగడ్డ’ హీరో గా ఒక సినిమా ప్రకటించింది ఈ ప్రొడక్షన్ టీం. ‘నరుడి బ్రతుకు నటన’ అనే ఈ సినిమా ద్వారా విమల్ కృష్ణ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం అవబోతున్నాడు. ఈ మధ్య మంచి మ్యూజిక్ ఇస్తు గుర్తింపు తెచ్చుకుంటున్న ‘కాల భైరవ’ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమాలో సిద్దు కి జోడీ గా ‘శ్రద్ధ శ్రీనాథ్’ నటించబోతుంది.
ఈ సంవత్సరం ఆరంభం లో ‘భీష్మ’ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న ఈ ప్రొడక్షన్ హౌస్ నితిన్ తోనే ‘రంగ్ దే’ అనే మరో సినిమా పూర్తి చేసే పనిలో ఉంది. ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి యూత్ ఫుల్ సినిమాలే కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు క్వాలిటీ గా తియ్యడం వీరి ప్రత్యేకత. జెర్సీ, ప్రేమమ్, రణరంగం లాంటి సినిమాలే ఇందుకు నిదర్శనం. మీడియం రేంజ్ హీరోలతో మంచి సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ లో విజయవంతం గా ముందుకు వెళ్తున్నారు. సిద్దు తో చెయ్యబోతున్న ‘నరుడి బ్రతుకు నటన’ సినిమా కూడా దీపావళి నుండి షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు.