హైదరాబాద్: అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న సినిమా ‘RRR’.
టాలీవుడ్ ఇద్దరు టాప్ మోస్ట్ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా తర్వాత ఇటీవలే పునః ప్రారంభం అయింది. ఈ రోజు రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీం రాజమౌళి గురించి కంప్లైంట్స్ చెబుతూ విభిన్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగుపుతూ ఒక వీడియో విడుదల చేసారు.
కో డైరెక్టర్ త్రికోటి మాట్లాడుతూ ‘విక్రమార్కుడు’ సినిమా నుంచి స్టోరీ సిట్టింగ్స్ ఆఫీస్ లోనో ఇంట్లోనో లోకల్ గా పెడుతూ ఉంటాడు. అందరూ స్టోరీ డిస్కషన్స్ కి బ్యాంకాక్ మలేషియా లో చేస్తున్నారు, మనం కూడా వెళదాం అని నేను ఒకసారి డైరెక్టర్ ని అడిగాను. ఇప్పటివరకైతే అలా జరగలేదు. ఈసారైనా మీరు బ్యాంకాక్ మలేషియాలలో సిట్టింగ్ పెట్టాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు. కీరవాణి మాట్లాడుతూ ‘పాత పల్లవి ఒకేసారి చేస్తాం, ఒక ఆరు నెలల తర్వాత చరణం చేస్తాం .. ఇంకో ఆరు నెలల తర్వాత దానికి సాహిత్యం రాస్తాం.. ఇంకొన్ని నెలల తర్వాత దానికి వాయిస్ రికార్డు చేసి మిక్స్ చేస్తాం.. ఈలోపు అసలు ఏ సినిమా కోసం పనిచేస్తున్నాం ఏ పాత చేస్తున్నాం, దాని పర్పస్ ఏంటి అనేది మర్చిపోతాం ఇంత ఆలస్యం అయ్యేసరికి ఇంట్రెస్ట్ పోతుంది’ అని కంప్లైంట్ చేసాడు.
హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘కాంప్లికేటెడ్ షాట్స్ ఎప్పుడూ మనం రిలాక్స్ అవుదాం అనుకునే టైములో పెడుతుంటాడు. 12.30కి ఒక షాట్ మొదలు పెడితే ఒంటి గంటకు కూడా అది ఒకే అవదు. షాట్ ని చెక్కుతూ చెక్కుతూ 2.30 అవుతుంది. నా దరిద్రమో లేదా అలా కుదురుతుందో తెలియదు కానీ, కరెక్ట్ గా అర్థరాత్రి 2 గంటలకు ప్యాక్ అప్ అవుతుంది అనుకుంటుండగా ఈ రాక్షసుడు ఒకటిన్నరకు షాట్ పెడతాడు. రెండున్నర మూడున్నర నాలుగున్నర.. ఒక్క షాట్ మూడు గంటలు.. ఆయన పర్ఫెక్షన్ తో మమ్మల్ని చావగొడుతుంటాడు’ అని చెప్పుకొచ్చాడు.
ఇక చరణ్ మాట్లాడుతూ ‘రాజమౌళి యాక్షన్ సీన్స్ తీస్తున్నాడని జిమ్ చేసి వెళ్ళాను. 40 ఫీట్ నుంచి జంప్ చేసే సీన్ చెప్పాడు. బాగుంది సర్ ఎవరు చేస్తున్నారు అని అడిగితే నువ్వే చేస్తున్నావ్ చరణ్ అన్నాడు. అదేంటి సార్ నెం చేయడం ఏంటి జోక్ చేస్తున్నారా అంటే.. లాప్ టాప్ తెప్పించి రెండు రోజుల ముందే అన్ని యాంగిల్స్ ఆ షాట్స్ ఆయన చేసినవి షూట్ చేసింది చూపిస్తాడు. ఆయన చేసిన తర్వాత మనం చేయకపోతే ఎలా అని, నో చెప్పలేక ముందుకు వెళ్ళిపోతాం’ అని చెప్పాడు. చివరగా ఈ రీజన్స్ కే మీకు థ్యాంక్స్ చెప్తున్నాం, బెస్ట్ రాబట్టడం కోసం ప్రతిరోజూ మమ్మల్ని పుష్ చేసినందుకు థ్యాంక్స్’ అంటూ ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ దర్శకధీరుడు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.