హైదరాబాద్: RX100 తో మొదటి సినిమా విజయవంతం అయిన తర్వాత రెండవ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలు తీసుకొని ‘మహా సముద్రం’ అనే సినిమా తీసున్నాడు డైరెక్టర్ ‘అజయ్ భూపతి’. ఇదొక మల్టీ స్టారర్ సినిమా. ఇందులో హీరోలుగా ఇప్పటికే శర్వానంద్, సిద్దార్థ్ ఎంపికయ్యారు. ఇప్పుడు అదితి రావు హైదరి ని ఒక హీరోయిన్ గా ప్రకటించారు మేకర్స్. తెలుగులో ఇప్పటికి ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’,’V ‘ మూడు సినిమాలు చేసిన ఆశించినంత సక్సెస్ అయితే ఈ హీరోయిన్ ని వరించలేదు. ఈ సినిమాతో అయినా సక్సెస్ దారి పట్టాలని ఎదురుచూస్తుంది. ఒక ఇంటెన్సిటీ ఉన్న లవ్ మరియు యాక్షన్ డ్రామా తో ఈ సినిమా రూపొందించబడుతుంది. ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్లని అనుకుని తర్వాత అదితి నే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అదితి ని సెలెక్ట్ చేసుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రామబ్రహ్మం సుంకర సమర్పిస్తున్నారు. తెలుగు-తమిళ ద్విభాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. వరుస ప్లాప్ లలో ఉన్న శర్వా ఈ సినిమా ద్వారా మరోసారి మంచి సక్సెస్ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు. చాలా రోజుల తర్వాత బొమ్మరిల్లు సిద్దార్థ్ కూడా ఈ సినిమా ద్వారా డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు.