షార్జా: కేకేఆర్ బౌలర్ సునీల్ నరైన్ బౌలింగ్ మళ్ళీ వివాదంలో చిక్కుకుంది. ఈ రోజు కొల్కత్తా కు బెంగళూరు కు మధ్య మ్యాచ్ జరగనుంది. ఐతే ఈ మ్యాచ్‌కు కేకేఆర్ వివాదాస్పద స్పిన్నర్ సునీల్ నరైన్ దూరమయ్యాడు. కింగ్స్ పంజాబ్‌తో ఆడిన గత మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు అంపైర్ల నుంచి ఫిర్యాదు అందింది. దాంతో నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై తుది నివేదిక వచ్చే వరకూ అతను దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ క్రమంలోనే నరైన్‌ను బెంగళూరు మ్యాచ్ నుంచి తప్పించారు. మరి రాబోవు టోర్నీలో నరైన్ ఉంటాడా, లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ నరైన్ యాక్షన్ సరిగా లేదని తేలితే మాత్రం ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమవుతాడు. ఇది కోల్కత్తాకు కాస్త నష్టం కలిగించే విషయమే.
మరి ఈ సిజన్ లో సునీల్ నరైన్ లేకుండా కోల్కత్తా నైట్ రైడర్స్ ఆటతీరు ఎలా ఉంటుందో చూడాలి అని నిపుణులు అంటున్నారు.