టాలీవుడ్: కరోనా కారణంగా ఆరు నెలలుగా థియేటర్లు తెరుచుకోలేదు. దీనితో చాలా మంది ఓటీటీ లకి అలవాటు పడ్డారు. చాలా కొత్త సినిమాలు కూడా ఓటీటీ లలో విడుదల అయ్యాయి అయితున్నాయి. కానీ ఇది ఇలాగే కొనసాగితే థియేటర్ ల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది. థియేటర్లు మూసుకుంటే వాటి మీద ఆధారపడిన చాలా రంగాలు కూడా మూతపడతాయి. థియేటర్ లలో మూవీ వేసే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ లు కూడా అందులో ఒకరు. అక్టోబర్ 15 నుండి థియేటర్ లు తెరచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ 50 శాతం మాత్రమే ఆకుపెన్సీ ఉండాలని నిబంధన విధించింది. దీని వల్ల థియేటర్ లు తెరచినా పెద్ద ఉపయోగం ఏం లేదు అని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు ఫీల్ అవుతున్నారు.
ఎలాగూ మంచి సినిమాలు ఇప్పుడే విడుదల చెయ్యరు, దీనితో పాటు శానిటైజింగ్ అని, 50 శాతం మాత్రమే ఆకుపెన్సీ అని, అలాగే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ ఖర్చులు అని చాలా భారంగా మారుతుండడం తో థియేటర్ యజమానులు ఇపుడు థియేటర్లు తెరవడానికి సుముఖంగా లేరు. అయితే వీరిని ఆకర్షించేందుకు మార్కెట్ లోని లీడింగ్ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ ‘క్యూబ్‘ 50% డిస్కౌంట్ ఇచ్చేందుకు ప్యాకేజీని ప్రకటించింది. ఈ ఆఫర్ 2020 డిసెంబర్ 31 వరకు కనీసం ఏడు ప్రదర్శనల బిల్లింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జనాలని థియేటర్లకు ఆకర్షించేందుకు అలాగే థియేటర్ యజమానులకు కొన్ని నష్టాలని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది.