కోలీవుడ్: శ్రీలంక మాజీ స్పిన్నర్ ‘ముత్తయ్య మురళీధరన్‘ కథ ఆధారంగా 800 అనే సినిమా రూపొందుతుందని అందులో మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసిన 24 గంటల్లోనే ఈ సినిమాకి రాజకీయ రంగులు పులుముకున్నాయి. సోషల్ మీడియా లో చాలా మంది 800 సినిమా మేకర్స్ ని అలాగే సినిమాలో నటిస్తున్న విజయ్ సేతుపతి ని విమర్శిస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా తమిళులని వేధిస్తోందని అలాంటి శ్రీలంక ఆటగాడి బయోపిక్ తియ్యడం ఏంటి అనేది వారి వాదన. విజయ్ సేతుపతి యాక్టింగ్ ని మెచ్చుకుంటాం కానీ ఈ నిర్ణయం లో విజయ్ సేతుపతి ని సపోర్ట్ చెయ్యలేం అనే విషయాన్ని వాళ్ళు చెపుతున్నారు.
800 మోషన్ పోస్టర్ లాంచ్ తరువాత #ShameOnVijaySethupathi ట్విట్టర్ లో ట్రెండింగ్ ప్రారంభమైంది. వివరాల్లోకి వెళ్తే మురళీధరన్ కూడా శ్రీలంక లో ఉన్న తమిళుడే. చిన్నప్పుడు మురళీధరన్ కూడా చాలా జాతి వివక్ష ని ఎదుర్కొన్నవాడే. కొన్ని విషయాలు మోషన్ పోస్టర్ లో కూడా చూపించారు. 1977 లో ఒకసారి జరిగిన అల్లర్లలో తాను కూడా పాలు పంచుకున్నాడని కూడా మురళీధరన్ ఒకసారి చెప్పారు. అంతే కాకుండా మురళీధరన్ ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇన్ని విషయాలలో మురళీధరన్ తమిళుల వైపు ఉన్న కూడా నెటిజన్లు విజయ్ సేతుపతి ని విమర్శించడం ఆశ్చర్యకరంగా ఉంది.