టాలీవుడ్: డైలాగ్ కింగ్ మోహన్ బాబు రెండవు కుమారుడు మంచు మనోజ్ ఇండస్ట్రీ లో అందరితో ఎంత చనువుతో ఉంటాడో తెలిసిన విషయమే. బాబాయ్ బాబాయ్ అంటూ పిలుస్తూ అందరినీ ఆటపట్టిస్తుంటాడు. ఈరోజు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా సాయి ధరమ్ తేజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే శుభాకాంక్షలు తెలుపుతూ మరొక అభిప్రాయం కూడా అడిగాడు.
‘ముందు జెనెరేషన్ లో మెగా స్టార్ చిరంజీవి, మోహన్ బాబు కలిసి ‘బిల్లా- రంగా’ అనే సినిమా తీశారు. సరిగ్గా అది ఈ రోజుకి 38 సంవత్సరాలు అయింది. పుట్టిన రోజు విషెస్ చెపుతూ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అప్పట్లో ఈ మల్టీ స్టారర్ ఒక రేంజ్ హిట్. ఈ సినిమా మనకొక విషయాన్నీ చెప్తుంది బాబాయ్.. నేను రెడీ నువ్వే మంటావ్?’ అని ట్విట్టర్ లో డైరెక్ట్ గా అడిగేశాడు మనోజ్. దీనికి బదులుగా సాయి ధరమ్ తేజ్ కూడా ఎప్పుడు కుదిరినా కూడా చేసేద్దాం అని బదులు ఇచ్చాడు. మరి వీళ్లిద్దరికీ సెట్ అయ్యే కథలు ఏమైనా ఉంటే తొందర్లో వీళ్ళ మెగా-మంచు మల్టీ స్టారర్ సినిమా మొదలయ్యే సూచనలున్నాయి.