fbpx
Friday, January 10, 2025
HomeMovie News'నిన్నిలా నిన్నిలా' ఫస్ట్ లుక్

‘నిన్నిలా నిన్నిలా’ ఫస్ట్ లుక్

AshokSelvan DirectTeluguMovie Firstlook

టాలీవుడ్: కోలీవుడ్ లో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయాణం ప్రారంభించి అంచలంచెలుగా ఎదుగుతూ చిన్న సినిమాలు చేసుకుంటూ ఈ సంవత్సరం విడుదలైన ‘ఓహ్ మై కడవులే’ సినిమా ద్వారా యూనివర్సల్ గుర్తింపు తెచ్చుకున్న హీరో ‘అశోక్ సెల్వన్’. ప్రస్తుతం ఈ హీరో తెలుగు లో ఒక డైరెక్ట్ మూవీ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ‘నిన్నిలా నిన్నిలా’ అనే ఒక సినిమా రూపొందుతుంది. ఈ సినిమా లో హీరోగా అశోక్ సెల్వన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అశోక్ సెల్వన్ తో పాటు నిత్యా మీనన్, రీతూ వర్మ కూడా నటిస్తున్నారు.

ఒక అర్బన్ రొమాంటిక్ కామెడీ మూవీ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ద్వారా ‘అని.ఐ.వి.శశి’ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ‘ప్రేమమ్’ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించిన రాజేష్ మురుగేషన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. తమ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఒక మీడియం బడ్జెట్ సినిమా రూపొందించి మంచి ఔట్పుట్ తో ఒక సినిమాని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని ఈ సినిమా ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు అలాగే విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తామని కూడా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular