కోలీవుడ్: తెలుగు మూలాలున్న అమ్మాయి ఐశ్వర్య రాజేష్, తమిళ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా పరిచయం అయ్యి అద్బుతమైన పాత్రలు చేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతుంది. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లో సువర్ణ పాత్ర ద్వారా చాలా మంచి పేరు తెచ్చుకుంది. తమిళ్ లో ‘కాక ముట్టై’ , ‘వడ చెన్నై’ ఈ మధ్యనే విడుదలైన ‘క పే రణసింగం‘ సినిమా ద్వారా తన నటనకి చాల మంచి ప్రశంసలు అందుకుంటుంది. తాను తర్వాత చేయబోతున్న ‘భూమిక’ అనే సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఈ సినిమా తెలుగు మరియు తమిళ్ లో రూపొందించబడుతుంది. ఈ ఫస్ట్ లుక్ ని తమిళ్ లో జయం రవి, తెలుగు లో తమన్నా భాటియా విడుదల చేసారు.
ఈ సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ చూసిన తర్వాత కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ లాగా అనిపిస్తుంది. టైటిల్ మరియు పోస్టర్ చూస్తే ఐశ్వర్య రాజేష్ ఇందులో భూమి పాత్రలో రాబోతున్నట్టు అర్దమైంది. పేరుకు తగ్గట్టే భూమాత గురించి, అలాగే ప్రకృతి గురించి ఏమైనా కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. తమిళ్ లో సూపర్ హిట్ డైరెక్టర్ ‘కార్తీక్ సుబ్బరాజ్’ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ పతాకంపై కార్తికేయన్ సంతానం, సుధ సుందరం, జయరామన్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రతీంద్రన్ ఆర్ ప్రసాద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.