కోలీవుడ్: విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ‘తుగ్లక్ దర్బార్’. రాజకీయాలపై సెటైరికల్ గా ఈ సినిమా ఉండబోతోంది. మొదట ఈ సినిమా హీరోయిన్ అదితి రావు ని ప్రకటించారు మేకర్స్. ఈ మధ్యనే ఈ సినిమాలో ‘రాశి ఖన్నా’ ని హీరోయిన్ గా తీసుకున్నట్టు ఈ మూవీ నిర్మాతలు ప్రకటించారు. అయితే అదితి ని కాదని రాశి ని ఎందుకు తీసుకున్నారో తెలియలేదు. దీనిపై అదితి రావు హైదరి తన వివరణ ఇచ్చింది. ఢిల్లీ ప్రసాద్ దీనాదయలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కరోనా కారణంగా దాదాపు 6 నెలలు ఇండస్ట్రీ మొత్తం స్తంభించింది. ఇప్పుడిప్పుడే మెల్లగా ఒక్కొక్కరు తమ పనులు, షూటింగ్లు మొదలు పెట్టారు. ఈ అనుకోని సంక్షోభం వల్ల చాలా మంది ప్లాన్స్ తారుమారు అయ్యాయి. ఇపుడు అందరూ ఒకేసారి షూటింగ్ లు ప్రారంభించడం వలన డేట్స్ క్లాష్ వస్తున్నాయి. అందువలన తాను ఒక నిర్ణయం తీసుకున్నని అదితి తెలిపింది. మొదట ఆల్రెడీ షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాలని పూర్తి చేసి ఆ తర్వాత కొత్త సినిమాలు చేస్తానని తెలిపింది. ఈ క్రమంలో షూటింగ్ ఇంకా మొదలవని ‘తుగ్లక్ దర్బార్’ నిర్మాతలతో చర్చించి అందరికీ అనుకూలమైన ఒక నిర్ణయం తోనే ఈ సినిమానుండి బయటకి వచ్చానని తెలిపింది. తన కోసం నిర్మాతలు రోజుల తరబడి ఎదురుచూడకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.