కోలీవుడ్: చంద్రముఖి ద్వారా సినిమా ఇండస్ట్రీ లోకి పరిచయం అయ్యి టాప్ లీగ్ లోకి చేరిన తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలే సెలెక్ట్ చేసుకుంటూ అద్భుతమైన పాత్రలు చేస్తూ ప్రశంసలు పొందుతూ తమిళనాట లేడీ సూపర్ స్టార్ గా పేరు గాంచింది. ఇపుడు కూడా అలాంటి మరో విభిన్నమైన పాత్రతోనే మరో సినిమాతో మన ముందుకు వస్తుంది. ‘నేత్రికన్’ అనే సినిమాలో అంధురాలిగా నటిస్తుంది నయనతార. తన కెరీర్లో 65 వ సినిమా గా రాబోతున్న ఈ సినిమాని ‘మిలింద్ రావు’ అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నేను రౌడీ నే’ సినిమా ద్వారా సూపర్ సక్సెస్ సాధించిన డైరెక్టర్ ‘విగ్నేష్ శివన్‘ అదే పేరుతో ‘రౌడీ పిక్చర్స్‘ అనే బ్యానర్ స్థాపించి ఆ బ్యానర్ ద్వారా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో నయనతార చేతిలో కర్ర లాంటిది పట్టుకొని బాగ్ గ్రౌండ్ లో గ్లాస్ బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. సినిమా టైటిల్ లోగో చూసినట్లయితే ‘బ్రెయిలీ’ లిపి లో ఉంది. అలాగే పోస్టర్ ని సరిగ్గా చూసినట్లయితే నయనతార అంధురాలి పాత్రలో నటిస్తున్నట్టు అర్ధం అవుతుంది. ‘నేత్రికన్’ అంటే మూడవ కన్ను. ఇదే పేరుతో తమిళ్ సూపర్ స్టార్ అప్పట్లో ఒక సినిమా తీసాడు. మళ్ళీ అదే పేరు వాడుకున్నందుకు విగ్నేష్ రజినీకాంత్ కి థాంక్స్ కూడా చెప్పారు. డిసెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాతో నయనతార కెరీర్ లో మరో విలక్షణమైన పాత్రతో మరోసారి ఆకట్టుకుంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు.