fbpx
Sunday, October 27, 2024
HomeSportsఐపీఎల్ 2020 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల

ఐపీఎల్ 2020 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల

IPL-2020-PLAYOFF-SCHEDULE-RELEASED

దుబాయ్‌: దుబాయ్ లో జరుగుతున్న ఐపీఎల్‌ 2020 ప్లేఆఫ్స్‌ షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేశారు. మొదట విడుదల చేసిన షెడ్యూల్‌లో కేవలం లీగ్‌ దశలో మ్యాచ్‌లనే వెల్లడించగా, ఇప్పుడు ప్లేఆఫ్స్‌ వేదికల్ని కూడా ఖరారు చేశారు. వచ్చే నెల నవంబర్‌ 3వ తేదీతో లీగ్‌ దశలో మ్యాచ్‌లు ముగుస్తుండగా, ప్లేఆఫ్స్‌ షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) వెల్లడించింది.

నవంబర్‌ 4వ తేదీన విశ్రాంతి దినంగా ప్రకటించారు. ఇక నవంబర్‌ 5 తేదీన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ జరుగనుంది. దుబాయ్‌ వేదికగా తొలి క్వాలిఫయర్‌ జరుగనుంది. పాయింట్ల పట్టికలో టాప్‌-1, టాప్‌-2లో నిలిచిన జట్లు క్వాలిఫయర్‌-1 లో తలపడతాయి.

నవంబర్‌ 6వ తేదీ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ టీమ్‌-3, టీమ్‌-4 జట్ల మధ్య అబుదాబి వేదికగా జరుగనుంది. ఇక నవంబర్‌ 8వ తేదీన అబుదాబి వేదికగా క్వాలిఫయర్‌-2 జరుగనుంది. క్వాలిఫయర్‌-2లో క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తలపడతాయి.

ఐపీఎల్‌-13 సీజన్‌ తుది పోరు దుబాయ్‌ వేదికగా క్వాలిఫయర్‌-1లో విజేత, క్వాలిఫయర్‌-2లో గెలిచిన జట్ల మధ్య జరుగుతుంది. మ్యాచ్‌లన్నీ రాత్రి గం. 7.30ని.లకు ప్రారంభమవుతాయి. మహిళల టీ20 చాలెంజ్‌కు షార్జాను వేదికగా ఖరారు చేయడంతో ఇక్కడ ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు నిర్వహించడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular