హైదరాబాద్: సినిమాలో సిచుయేషన్ కి తగ్గట్టు పాటలు ట్యూన్ చేయడం రాయించడం మామూలే. అయితే రియల్ టైం సిచుయేషన్స్ కి రియల్ హీరోలకి పాటలు రాయడం ప్రత్యేకంగా ఉంటాయి. కీరవాణి అందులో సిద్ద హస్తుడు. ఇదివరకే కూడా కొన్ని సందర్భాల్లో ఇలా చేసాడు. కరోనా సందర్భం లో ఒక పాట ట్యూన్ చేసి విడుదల చేసారు. ఇపుడు మరోసారి పోలీసుల ధీరత్వం పై మరో పాట పాడి విడుదల చేసారు. కరోనా సందర్భం లో , హైదరాబాద్ లో మొన్న వచ్చిన వరదల సమయంలో పోలీసుల శ్రమని ని ఉద్దేశింది పాట పాడారు కీరవాణి. విధి నిర్వహణలో తమకు ఎదురయ్యే సవాళ్ళని, ఇబ్బందులని కలిపి అనంత్ శ్రీరామ్ పాట రచించగా దానికి కీరవాణి ట్యూన్ కట్టాడు.
అక్టోబర్ 21 న పోలీసు అమర వీరుల దినోత్సవం జరుపుకొని 21 నుండి 31 వ తేదీ వారికి పోలీసు ఫ్లాగ్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈ పాటని తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేసారు. పాటను ట్యూన్ చేసిన కీరవాణి కి అలాగే పాట రచించిన అనంత్ శ్రీరామ్ కి అభినందనలు తెలియ చేసారు.