టాలీవుడ్: షార్ట్ ఫిలిమ్స్ నుండి హీరో గా సినిమాల్లోకి అడుగుపెట్టి మొదట్లో వరుస హిట్లు కొట్టి తర్వాత వరుసగా ప్లాప్ లని ఎదుర్కొంటున్నాడు రాజ్ తరుణ్. తనని మళ్ళీ ఇండస్ట్రీ లో గట్టిగా నిలబెట్టే సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్యన రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ఓటీటీ లో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా తోనే మరొక సినిమా కూడా ప్రారంభించాడు. ఇదోక థ్రిల్లర్ మూవీ అని ఇంతకముందు చెప్పారు. ఇదే కాకుండా ఇపుడు తన తర్వాతి సినిమా కూడా ప్రారంభించాడు ఈ యంగ్ హీరో. తన కెరీర్ లో 15 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో ‘జాను’, ‘బిగిల్’ లో నటించిన వర్ష బొల్లామా హీరోయిన్ గా నటిస్తుంది.
డ్రీం టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నందకుమార్, భారత్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో వెన్నెల కిషోర్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమా ద్వారా మోహన్ వీరంకి (శాంటో) అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. ఈ దర్శకుడు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వేరే దేశాల్లో కొన్ని అవార్డులు కూడా పొందాడు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాకి సంగీతం అందించిన ‘స్వీకర్ అగస్తి’ ఈ సినిమాకి కూడా సంగీతం అందించబోతున్నాడు.