షార్జా: చావో రేవో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. గెలిస్తే తప్ప నిలవలేని స్థితిలో ముంబై పై పద్ వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని అందుకుని ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. భయంకరమైన ఫాం లో ఉన్న ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసులో ముందంజలో ఉంది. ఆ జట్టు పై గెలవడమే కష్టం అనుకుంటే, మొదట బౌలింగ్ లో ముంబై ని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు సన్ రైజర్స్ బౌలర్లు.
అంత కష్టతరం కాని లక్ష్య చేధనకు బరిలో దిగిన హైదరాబాద్ ఓపెనర్లు వార్నర్, సాహా అధ్భుత బ్యాటింగ్ తో వికెట్ నష్ట పోకుండా 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.1 ఓవర్లలోనే చేధించి గొప్ప విజయాన్ని సొంథం చేసుకుంది.
హైదరాబాద్ గెలిచి ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టడం తో కొల్కత్తా నైట్ రైడర్స్ ఆశలు ఆవిరయ్యాయి. కేకేఆర్ సిరీస్ నుండి నిష్క్రమించింది. ఈ విజయంతో ముందుకెళ్ళిన హైదరాబాద్ ప్లే ఆఫ్స్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో తలపడనుంది.