బాలీవుడ్: తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ సినిమా రేంజ్ వేరే స్థాయికి వెళ్ళింది అని చెప్పవచ్చు. ఒక తెలుగు లోనే కాకుండా ఇండియా మొత్తం అలాగే కొన్ని ఏషియన్ కంట్రీస్ లో బాహుబలి చాలా ఫేమస్. ఇపుడు ఈ సినిమాని మళ్ళీ థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. కరోనా వల్ల 7 నెలలుగా థియేటర్లు అన్నీ మూసివేయబడినవి. ఇపుడు ప్రభుత్వం అన్లాక్ ప్రక్రియ ద్వారా థియేటర్లు తెరచుకోవచ్చని అనుమతులు మంజూరు చేసింది. కోవిడ్ నిబంధనల్ని అనుసరిస్తూ థియేటర్ లు తెరచుకోబోతున్నాయి.
ప్రస్తుతం మహారాష్ట్రలో రేపటినుండి థియేటర్లు తెరచుకోనున్నాయి. గవర్నమెంట్ విధించిన నిబంధనల ప్రకారం కేవలం యాభై శాతం ఆక్కుపెన్సీ తో మాత్రమే షోలు వెయ్యాలి. అయితే ఈ థియేటర్లలో మొదటగా బాహుబలి సినిమాను వెయ్యబోతున్నారు అని ప్రకటన వెలువడింది. బాహుబలి రెండు పార్ట్ లని ఒక్కో వారం మళ్ళీ విడుదల చేయబోతున్నట్టు బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ తన ట్విట్టర్ హేండిల్ ద్వారా తెలిపారు.