టాలీవుడ్: కెరీర్ ప్రారంభం లో నితిన్ తో ‘లై’, ‘చల్ మోహన్ రంగ’ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది మేఘ ఆకాష్. ఈ రెండు సినిమాలు పరవాలేదనిపించిన మేఘ కి తెలుగు లో అంతగా ఆఫర్లు రాలేదు. తమిళ్ లో బాగానే సినిమాలు చేస్తున్నా కూడా తెలుగు వైపు రాలేదు. మళ్ళీ ఇపుడు సత్యదేవ్ , తమన్నా నటిస్తున్న ‘గుర్తుండా శీతాకాలం’ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో తెలుగు అభిమానులని పలకరించడానికి వస్తుంది మేఘ ఆకాష్. ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ సినిమా తో హిట్ అందుకున్న టాలెంటెడ్ ఆక్టర్ సత్యదేవ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడ సూపర్ హిట్ ‘లవ్ మోక్టైల్’ అనే సినిమాకి ఆఫీషియల్ రీ-మేక్ గా రాబోతుంది ఈసినిమా.
ఈ సినిమా కథ ప్రకారం హీరో లైఫ్ లోని డిఫరెంట్ స్టేజెస్ ని చూపిస్తారు. ఒక్కో స్టేజి లో ఒక్కో అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉంటాడు హీరో. ఇందుకోసం ఈ సినిమాలో ఎక్కువ మంది హీరోయిన్ లని పరిశీలిస్తున్నారు సినిమా టీం. అందులో భాగంగానే ఒక ముఖ్యమైన పాత్ర కోసం మేఘ ఆకాష్ ని ఎంపిక చేసారు. నాగశేఖర్ మూవీస్ బ్యానర్ పై నాగశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి కలర్ ఫోటో తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ సంగీతం సమకూర్చనున్నారు. ఈ సినిమా ఆగిపోయింది అని రక రకాలుగా వస్తున్నా రూమర్లకు ఈ వార్తతో చెక్ పెట్టినట్టైంది.