వాషింగ్టన్ : డెయిలీ మెయిల్ కథనం ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి భాధలో ఉన్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత జీవితంలో కూడా అంతకంటే భారీ నష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ భార్య అయిన మెలానియా ట్రంప్ ఆయనకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ వైట్ హౌస్‌ని విడిచిపెట్టిన వెంటనే మెలానియా కూడా ఆయనకి శాశ్వతంగా గుడ్ బై చెప్పేస్తారని బ్రిటీష్ టాబ్లాయిడ్ డెయిలీ మెయిల్ ఓ కథనాన్ని ప్రచురించింది.
15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామా అని మెలానియా ఎదురుచూస్తున్నట్లుగా ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పిన ట్టుగా డెయిలీ మెయిల్ వెల్లడించింది. ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన మరు క్షణమే విడాకులు ఇవ్వాలని మెలానియా నిముషాలు లెక్కబెడుతోంది. వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. అవసరం కోసం ఇద్దరూ అలా కాలం గడిపేస్తున్నారు’’అని ఒమరోసా తెలిపారు.
అమెరికాలో దేశంలో ఫస్ట్ లేడీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఎప్పట్నుంచో విభేదాలున్నప్పటికీ అధ్యక్ష పదవిలో ఉండగా మెలానియా ఆయనకు విడాకులు ఇచ్చి ఇబ్బంది పెట్టాలని అనుకోలేదని, ఇప్పుడు ట్రంప్ ఓడిపోవడంతో ఆయన వైట్ హౌస్ వీడిన వెంటనే మెలానియా కూడా ఆయన నుంచి విడిపోతారని ఆ కథనం వెల్లడించింది.
ట్రంప్‌కున్న ఆస్తిపాస్తుల్లో తనకి, తన కుమారుడు సమాన వాటా కావాలంటూ మెలానియా ఒప్పందం కుదుర్చుకున్నారని, అది కుదిరాక శ్వేతసౌధానికి ఆమె వచ్చారని ట్రంప్ అనుచరుడు స్టీఫెన్ ఓల్కాఫ్ వెల్లడించారు. వారి పడక గదులు వైట్ హౌస్‌లో వేర్వేరు అంతస్తుల్లో ఉన్నాయని గతంలో వార్తలొచ్చాయి. (డెయిలీ మెయిల్ కథనం ప్రకారం).