టాలీవుడ్: టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోల్లో లవ్ స్టోరీల్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న హీరో నాగ చైతన్య. తనకి బాగా నప్పే సినిమాలు కూడా అవే. ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ తోనే ఒక లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు ఈ అక్కినేని హీరో. క్లాస్ మరియు సెన్సిబుల్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నాగ చైతన్య కి జోడీ గా ‘సాయి పల్లవి’ నటిస్తుంది. దీపావళి సందర్భంగా ఈ సినిమా నుండి ఒక క్యూట్ పోస్టర్ విడుదల చేసారు. ఈ పోస్టర్ లో పెళ్లి పీటల పైన కూర్చొని సిగ్గు పడుతున్న చైతూ మరియు సాయి పల్లవి లుక్ సింపుల్ గా క్యూట్ గా ఉండి ఆకట్టుకున్నారు.
ఈ సినిమా ఈ సమ్మర్ కి విడుదల చేసే ప్లాన్ లో ఉండే కానీ కరోనా వల్ల ఆలస్యం అయింది. ఈ మధ్యనే షూటింగ్ ముగించిన ఈ సినిమా థియేటర్ లు తెరుచుకునే సమయం కోసం ఎదురుచూస్తుంది. ఇదివరకు ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, పోస్టర్ లు బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పైన కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. పవన్ సి హెచ్ అనే కొత్త సంగీత దర్శకుడు ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.