టాలీవుడ్: టాలీవుడ్ లో మరొక ఇంటరెస్టింగ్ మల్టీ స్టారర్ మూవీ గా తెరకెక్కబోతున్న సినిమా ‘మహా సముద్రం’. ఇద్దరు విలక్షణ నటులు శర్వానంద్, సిదార్థ్ కలిసి నటించబోతున్న ఈ సినిమా పైన మంచి అంచనాలే ఉన్నాయి. RX100 సినిమా తర్వాత చాలా రోజులు ఎదురు చూసి ఈ సినిమాని రూపొందించబోతున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. చాలా సంవత్సరాల తర్వాత సిద్దార్థ ఈ సినిమా ద్వారా డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అదితి రావు హైదరి మరియు అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఒక ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి సంబందించిన థీమ్ పోస్టర్ ఇవాళ విడుదల చేసారు. ‘బైగోన్స్ బైగోన్స్ గా ఉండనివ్వండి… ప్రేమ ఎప్పటికీ ఉంటుంది’ అంటూ ఈ సినిమా థీమ్ పోస్టర్ విడుదల చేసారు ఈ సినిమా మేకర్స్. ఒక వైపు ప్రేమ మరో వైపు యుద్ధం అని ట్వీట్ చేసారు మేకర్స్. బ్యాక్ గ్రౌండ్ లో సముద్రం, ఒక వైపు ఒక ప్రేమ జంట మరొక వైపు ట్రైన్ ని అందుకోవడానికి పరిగెత్తుతున్న ఒక యువకుడు.. ఒక వైపు గురి పెట్టి ఉన్న తుపాకీ.. మరో వైపు తుపాకీ అంచున ఉన్న ఒక వ్యక్తి.. ఇలా థీమ్ పోస్టర్ అయితే సినిమా పైన బజ్ క్రియేట్ చేయగలిగింది. ఈ సినిమా పోస్టర్ ని ట్వీట్ చేస్తూ ‘నేను అలల కంటే మొండిగా ఉన్నాను.. సముద్రాల కంటే లోతుగా ఉన్నాను! ఎవరు నువ్వు?’ అంటూ పోస్టర్ విడుదల చేసారు.