fbpx
Friday, January 10, 2025
HomeBig Storyగత 24 గంటల్లో దేశంలో 41100 కొత్త కరోనా కేసులు

గత 24 గంటల్లో దేశంలో 41100 కొత్త కరోనా కేసులు

INDIA-RECORDS-41100-CORONA-CASES-YESTERDAY

న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 88 లక్షల మార్కును దాటేసింది. కాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 41,100 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఈ కేసులతో మొత్తం ఇప్పటికి కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 88,14,579కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24గంటల్లో దేశంలో కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా మొత్తం 447మంది మృతి చెందారు. ఈ మరణాలతో మొత్తం కరోనా వైరస్‌ కారణంగా దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 1,29,635కి చేరింది.

కాగా గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా కోవిడ్ నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రులను నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 42,156గా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా చికిత్స అందించి 82,05,728 మందిని డిశ్చార్జ్ చేయడం జరిగింది.

దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 4,79,216గా ఉంది. ఇక దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 93.09 శాతంగా నమోదైంది. దేశంలో నమోదయిన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 5.44గా ఉంది. అదే విధంగా దేశంలో మొత్తం నమోదయిన కేసుల్లో మరణాల రేటు 1.47 శాతానికి తగ్గినట్లు హెల్త్ బులిటెన్‌ ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular