fbpx
Thursday, December 26, 2024
HomeInternationalగుండె ఆగిన 45 నిమిషాలకు తిరిగి కొట్టుకుంది!

గుండె ఆగిన 45 నిమిషాలకు తిరిగి కొట్టుకుంది!

HEART-START-BEATING-AFTER-45-MINUTES

వాషింగ్టన్‌: ఇదొక ఆశ్చర్యకరమైన విషయం, ఒక చనిపోయిన వ్యక్తి తిరిగి బతికిన సంఘటన అందరిని అబ్బురపరచింది. మంచు కొండ పర్యటనకు వెళ్లిన వ్యక్తి, అక్కడి మంచులో కూరుకుపోవడంతో అతడిని రక్షించి స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. అయితే అప్పటికే అతడి గుండె కూడా కొట్టుకోవడం ఆగిపోయింది.

ఇది జరిగిన 45 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించడంతో అతడు మృత్యువును జయించిన వాడు అయ్యాడు. ఆ అదృష్టవంతుడు ఎవరంటే అమెరికాకు చెందిన మైఖేల్‌ నాపిన్క్సి. 45 ఏళ్ల వయసున్న అతడు కాలినడకన దేశ పర్యటన చేస్తుంటాడు.

అదే అలవాటుతో తను గతవారం తన స్నేహితుడితో కలిసి అమెరికాలోని మౌంట్‌ రైనర్‌ నేషనల్‌ పార్క్‌లోని మంచుకొండకు కాలినడకన పర్యటనకు వెళ్లాడు. నాపిన్క్సి, అతడి స్నేహితుడు చెరో దిక్కున పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నాపిన్క్సి ఓ చోట మంచులో కూరుకున్నాడు. అయితే వీరిద్దరూ తిరిగి కలుసుకునే చోటును ముందే నిర్ణయించుకున్నారు.

ఎంత సేపటికైన నాపిన్క్సి తాము అనుకున్న చోటికి తిరిగి రాకపోవడం అతడి స్నేహితుడు సహాయక బృందానికి సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం హెలికాప్టర్‌తో గాలింపు చర్యల చేపట్టింది. ఈ క్రమంలో కొద్ది సమయానికి నాపిన్క్సిని గుర్తించి రక్షించిన టీం హుటాహుటిన స్థానిక హాస్పిటల్‌కు తరలించింది.

ఆ సమయానికి అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పటికి పల్స్‌ మాత్రం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అతడిని రక్షించేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించారు. సీపీఆర్‌ చేసి అతడిలోని అధిక కార్బోరియల్‌ మెమ్బేన్‌ ఆక్సిజనేషన్‌ (ఇసీఎంఓ) యంత్రంతో చికిత్స అందించామని ఆస్పత్రి వైద్యులు జెనెల్లా బదులక్‌ స్థానిక మీడియాతో పేర్కొన్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular