టాలీవుడ్: RX100 సినిమా లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ద్వారా పరిచయం అయ్యి అందర్నీ మెప్పించిన నటి పాయల్ రాజ్ పుత్. ఆ తర్వాత డిస్కో రాజా, వెంకీ మామ లాంటి పెద్ద హీరోల సినిమాలు చేసినప్పటికీ ఆశించినంత సక్సెస్ , గుర్తింపు రాలేదు. ఇపుడు మరొక సారి ఒక విభిన్న మైన పాత్రతో మన ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమాలో పాయల్ నటిస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల అయింది.
ఒక గ్రామంలో నివసించే ఒక కుటుంబం లోకి అనుకోకుండా ఒక అతిధి వస్తాడు. ఆ అతిధి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎటు వైపుకు సాగుతాయి చివరకి ఏం జరుగుతుంది అనేది మిగతా కథ అన్న విషయం ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. దురాశ వినాశనానికి మూలం అనే పాయింట్ తో ట్రైలర్ మొదలవుతుంది. తమ వద్దకి వచ్చిన అతిధి దగ్గర ఉన్న సొమ్ముకు ఆశపడి ఆ కుటుంబం ఏం చేసిందనేది ట్రైలర్ లో కొన్ని సీన్స్ ద్వారా చూపించారు. ట్రైలర్ ని బట్టి చూస్తే ఆ అతిధి పాత్రలో చైతన్య కృష్ణ నటించాడు. ప్రస్తుతం భారీ కంటెంట్ తో దూసుకెళ్తున్న 100 % తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో ఈ సినిమా విడుదల అవబోతుంది. థ్రిల్లింగ్ అంశాలతో రాబోతున్న ఈ సినిమా నవంబర్ 20 నుండి అందుబాటులో ఉండబోతుంది.