శాండల్ వుడ్: ఒకప్పుడు సౌత్ ఇండియన్ మూవీస్ అంటే తమిళ్ మూవీస్ అన్నట్టే ఉండేది. ఇపుడు మెల్లిగా మలయాళం, తెలుగు మూవీస్ లో కొత్త రకమైన కథలు, ప్రయోగాలు వచ్చి సౌత్ మూవీస్ అంటే తెలుగు , తమిళ్ మరియు మలయాళం సినిమాలు అనే స్టేజి కి వచ్చింది. కన్నడ సినిమాలు మిగతా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కంటే కొంచెం తక్కువ ఉండేవి. అక్కడ కూడా కొన్ని మంచి సినిమాలు వచ్చేవి కానీ చాలా తక్కువ. కానీ కెజిఫ్ సినిమా తర్వాత పరిస్థితి మారింది. అందరూ కన్నడ సినిమా ఇండస్ట్రీ వైపు కూడా ఒక చూపు చూస్తున్నారు. అక్కడి సినిమాలని ఆదరిస్తున్నారు. ఓటీటీ ల వల్ల కూడా కన్నడ సినిమాలకి ఆదరణ బాగానే పెరుగుతుంది. ఈ మధ్య వచ్చిన ‘దియా’,’లవ్ మాక్ టైల్’ లాంటి సినిమాలు హిట్ అవడం దానికి నిదర్శనం.
ఇపుడు మరొక పాన్ ఇండియా లెవెల్ సినిమా కన్నడ నుండి రాబోతుంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఎంత విలక్షణమైన నటుడో తెలిసిందే. కెరీర్ ప్రారంభం లో ‘రా’,’ఉపేంద్ర’,’A ‘ లాంటి ప్రయోగాలు ఎన్నో చేసాడు. ఇపుడు మరోసారి ‘కబ్జ’ అనే సినిమాతో వస్తున్నాడు. ఇది కూడా పీరియాడిక్ మూవీ గా తెరకెక్కుతుంది. 1947 లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా అదే టైం పీరియడ్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా రూపొందుతుంది. ఉపేంద్ర కి ఇదివరకే వివిధ భాషల్లో ఉన్న గుర్తింపు దృష్ట్యా కూడా ఈ సినిమాని వివిధ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసారు. ఆర్ చంద్రు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.ఈ సినిమాని సౌత్ భాషలైన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మాత్రమే కాకుండా మరాఠి, ఒరియా మరియు హిందీ భాషల్లో కూడా విడుదల చేయడం విశేషం.