fbpx
Thursday, December 26, 2024
HomeBig Storyఫైజర్ కంపెనీ నుండి క్రిస్మస్ ముందే వ్యాక్సిన్?

ఫైజర్ కంపెనీ నుండి క్రిస్మస్ ముందే వ్యాక్సిన్?

PFIZER-VACCINE-BEFORE-CHRISTMAS-EXPECTED

న్యూఢిల్లీ: ఇప్పటికే భారీ ఊరటనిచ్చిన వ్యాక్సిన్‌ తయారీదారులు కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మరో పెద్ద శుభవార్త అందించారు. అన్ని అనుకున్నట్టే జరిగితే మరి కొద్ది రోజుల్లోనే కోవిడ్‌-19 వ్యాక్సిన్ డెలివరీ షురూ అవనుంది. ఈ మేరకు బయోఎన్‌టెక్ సీఈవ్ ఉగుర్ సాహిన్ రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బుధవారం (నవంబర్ 18న) ప్రకటించారు.

ఈ సంవత్సరం క్రిస్మస్ కంటే ముందే ఫైజర్ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ డెలివరీ మొదలు పెట్టలని భావిస్తున్నామని అన్నారు. తమ కరోనా టీకా 95 శాతం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నట్టు అమెరికా కంపెనీ ఫైజ‌ర్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగుర్ సాహిన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

యూరోప్‌లో ఈ వ్యాక్సిన్‌కు డిసెంబరులో టీకా అత్యవసర వినియోగం ఆమోదం, డిసెంబర్ రెండవ భాగంలో షరతులతో కూడిన అనుమతి లభించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. అన్నీ సానుకూలంగా జరిగితేనే డిసెంబ‌ర్ మ‌ధ్య‌లో టీకాకు అనుమ‌తి లభిస్తుందని, క్రిస్మ‌స్ పండుగ లోపే డెలివ‌రీలు ప్రారంభం అవుతాయ‌ని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.

జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌తో కలిసి తయారు చేసిన తమ రెండు డోసుల టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో అన్ని ప్రాథమిక ప్రమాణాల్లో విజయం సాధించిందని ప్రకటించేందుకు గర్వంగా ఉందని ఫైజ‌ర్‌ తెలిపింది. 65 ఏళ్లు పైబడిన పెద్దలలో కూడా తమ టీకా సామర్థ్యం 94శాతం కంటే ఎక్కువేననని తుది ప్రయోగ ఫలితాల్లో తాజాగా వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular